బండ్ల బండ బూతులు!

- Advertisement -
Trivikram Bandla Ganesh


బండ్ల గణేష్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫోన్ చెయ్యడం, ఆ ఫోన్ సంభాషణల్లో బండ్ల త్రివిక్రమ్ ని దూషించడం, అవి లీక్ కావడం… ఈ మండే రోజు మండిన విషయం (అదేనండి బర్నింగ్ టాపిక్). ఇప్పటికే రెండు ఆడియోలు లీక్ అయ్యాయి. ఈ రెండింటిలోనూ త్రివిక్రమ్ ని ఘోరంగా తిట్టాడు బండ్ల.

‘భీమ్లా నాయక్’ సినిమా ఈవెంట్ కి రావొద్దని తనకి త్రివిక్రమ్ కబురు పంపించాడని బండ్ల అంటున్నారు. దాంతో, ఈ బండ బూతుల పర్వం మొదలుపెట్టారు బండ్ల.

“త్రివిక్రమ్ అన్యాయం చేశాడు. త్రివిక్రమ్ *@#$%* (బూతు )వాడు… *$%* (బూతు)… *$%* (బూతు)… రేప్పొద్దున సినిమా తేడా కొడితే త్రివిక్రమ్ ని నేనే వెళ్లి కొడుతా… ఆల్రెడీ అజ్ఞాతవాసితో దెబ్బ కొట్టాడు…,” ఇలా బూతుల పర్వం సాగింది బండ్ల గణేష్.

ఆయన మాట తీరు చూస్తుంటే వీళ్లిద్దరికీ ఎక్కడో చెడినట్లు ఉంది.

More

Related Stories