
తనకు నాలుక అదుపులో ఉండదని, అందుకే విమర్శల పాలవుతుంటానని స్వయంగా బండ్ల గణేశ్ ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. తను మంచిగా ఉండాలనుకుంటానని, కానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడ్డం వల్ల చాలాసార్లు వివాదాలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చాడు. ఇన్ని చెప్పిన బండ్ల గణేశ్.. ఇప్పుడు మరోసారి అదే నోటి దురుసుతో నయనతారపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న బండ్ల.. తను నిర్మించిన సినిమాల్లోని హీరోయిన్లపై స్పందించాడు. ఒక్కో హీరోయిన్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. నయనతార దగ్గరకు వచ్చేసరికి మాత్రం అదో రకమైన ఎక్స్ ప్రెషన్ పెట్టాడు. తన తొలి హీరోయిన్ అంటూనే.. “అప్పట్లో ప్రభుదేవా-నయనతార” అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు.

ప్రభుదేవా విషయంలో చాన్నాళ్ల పాటు బాధపడిన నయనతార ఆ పాత జ్ఞాపకం నుంచి బయటకొచ్చి విఘ్నేష్ శివన్ కు క్లోజ్ అయింది. ఇలాంటి టైమ్ లో ప్రభుదేవా పేరు ప్రస్తావించి నయనతార ఫ్యాన్స్ ను ఇరిటేట్ చేశాడు బండ్ల గణేశ్.