
ఇక అయోమయం ఏమి లేదు. నాగార్జున ‘బంగార్రాజు’ విషయంలో పక్కాగా ఉన్నారు. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే. ఈ షూటింగ్ తో పాటు “బిగ్ బాస్ సీజన్ 5” కూడా చేస్తారు.
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, మరో కీలక పాత్రలో నాగ చైతన్య నటించనున్నారు. చైతన్యకి జోడిగా ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి ఖరారు అయింది.
‘సోగ్గాడే చిన్ని నాయన’ అనే సినిమాకిది సీక్వెల్. ఐదేళ్ల గ్యాప్ తర్వాత సీక్వెల్ సెట్స్ పైకి వెళ్తుండడం విశేషం.
ఈ సినిమా కన్నా ముందే దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసే యాక్షన్ థ్రిల్లర్ కూడా షురూ చేస్తారు. ఆగస్టు 4 నుంచి ప్రవీణ్ సత్తారు – నాగార్జున మూవీ షూటింగ్ మళ్ళీ మొదలవుతుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్.