జీ5లో బంగార్రాజు రికార్డ్

Bangarraju

జీ5 ‘వినోదం మాత్రమే కాదు, అంతకు మించి’ అన్నట్లు దూసుకు పోతోంది. ఓటిటి వేదికల మధ్య పోటీ ఎక్కువ ఉంది. అయినా, కొత్త కొత్త సినిమాలు విడుదల చేస్తూ చూపు తనవైపు తిప్పుకుంటోంది జీ5.

తాజాగా అక్కినేని నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్‌లో ‘బంగార్రాజు’ సినిమాని విడుదలైన నెల రోజులకే స్ట్రీమ్ చేసింది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది ‘బంగార్రాజు’. ఫిబ్రవరి 18న ‘జీ 5’ లో రిలీజ్ చేశారు.

విడుదలైన 7 రోజుల్లో 500 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసిందట. తమ సినిమాకి ఇంత ఆదరణ దక్కడం మాకెంతో హ్యాపీగా ఉందని ట్విట్టర్ ద్వారా అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, హీరోయిన్ కృతి శెట్టిలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

” జీ 5 లో స్ట్రీమింగ్ మొదలైన కేవలం 7 రోజుల్లో 500 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అవ్వడం ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఒక సరికొత్త రికార్డ్. ఈ సందర్భంగా బంగార్రాజు ను ఆదరించిన, ఆదరిస్తున్న, ఆదరించబోతున్న ప్రేక్షకులందరికీ మా టీం తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం,” అన్నారు అక్కినేని నాగార్జున.

Advertisement
 

More

Related Stories