
“బంగార్రాజు గురించి మీరు అంచనాలు ఎంత పెంచుకున్నా పర్వాలేదు. మీ ఊహలకు మించి ఉంటుంది సినిమా,” అని అన్నారు నాగార్జున. ఈ సినిమా మ్యూజికల్ నైట్ ఆదివారం ఘనంగా జరిగింది.
“జనవరి 14న విడుదల అవుతోంది. ‘దసరా బుల్లోడు’ సినిమాతో నాన్న గారు సంక్రాంతికి దుమ్ములేపారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఎలా ఆడిందో చూశారు. ఇప్పుడు ఇది. ప్రతీ సాంగ్ ఓ వజ్రంలా ఉంటుంది. సూపర్ హిట్ ఆల్బమ్. జనవరి 11న ట్రైలర్ రాబోతోంది. జనవరి 14న పండుగలాంటి సినిమాను తీసుకొస్తున్నాం,” అన్నారు నాగార్జున.
నాగ చైతన్య, నాగార్జున కలిసి నటించిన చిత్రం ఇది. కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతం ఇచ్చారు. రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లు.
“మనం సినిమాకు ఇలాంటి ఫంక్షన్ చేశాం. బంగార్రాజుకు మళ్లీ ఇలా చేయడం ఆనందంగా ఉంది. ఆడియోను పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది బంగార్రాజు,” అని ధీమాగా చెప్పారు నాగ చైతన్య.