
ఇప్పుడు తెలంగాణ సంస్కృతి, తెలంగాణ జీవన చిత్రం తెలుగు సినిమాల్లో కథావస్తువు అయింది. తెలంగాణ మెయిన్ థీమ్ గా మారుతోంది. ఇక, బాలీవుడ్ కూడా తెలంగాణ సంస్కృతికి జై కొడుతోంది. తెలంగాణ బతుకమ్మ పండుగ ఒక బడా హిందీ సినిమాలో చూస్తామని ఎవరూ ఊహించి ఉండరు. కానీ, సల్మాన్ ఖాన్ వల్ల సాధ్యమవుతోంది.
సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న కిసి కా భాయ్ కిసి కా జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) సినిమాలో ఏకంగా బతుకమ్మపై గ్రాండ్ గా పాట పెట్టారు. ఈ సినిమాలో వెంకటేష్ తెలంగాణకి చెందిన ఒక ధనవంతుడిగా నటిస్తున్నారు. అతని చెల్లెలుగా పూజ హెగ్డే నటిస్తోంది. భూమిక వెంకటేష్ భార్యగా నటిస్తోంది. సో… సినిమాలో వీరిపై ఒక బతుకమ్మ పాట తీశారు.
సల్మాన్ ఖాన్ పూజ హెగ్డే ప్రేమలో పడుతాడు. ఈ సినిమా వచ్చే నెల విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఈ పాటని విడుదల చేశారు.
నార్త్ వాళ్లకు నచ్చేవిధంగా కొంత కలర్ ఫుల్ గా, గ్రాండ్ గా మార్చేశారు బతుకమ్మ ఆటని. పూజ హెగ్డే ఎన్నో తెలుగు సినిమాల్లో నటించింది. కానీ ఆమె ఏ తెలుగు సినిమాల్లో బతుకమ్మ ఆడే సీన్ చెయ్యలేదు. హిందీలో చెయ్యడం విశేషం.