బాలయ్య సినిమాకు 9 కోట్ల ఆఫర్

BB3 - Balakrishna

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. వీళ్లిద్దరిదీ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఇంతకుముందు “సింహా”, “లెజెండ్” లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. అందుకే ఈ హ్యాట్రిక్ మూవీపై అందరి చూపు పడింది. అందుకు తగ్గట్టే క్రేజ్ పెరిగింది. అలా 9 కోట్ల ఆఫర్ అందుకుంది బాలయ్య-బోయపాటి మూవీ.

ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ కోసం 9 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది అమెజాన్ ప్రైమ్ సంస్థ. అయితే అగ్రిమెంట్ ఇంకా పూర్తవ్వలేదు. రేటుకు మేకర్స్ ఓకే చెప్పినప్పటికీ శాటిలైట్ కోసం వెయిట్ చేస్తున్నారు. స్ట్రీమింగ్ రైట్స్ అంటే… డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కాదు. థియేటర్లో విడుదల అయ్యాకే, స్ట్రీమింగ్ చెయ్యాలి. ఈ సినిమాని ఏప్రిల్ 30, 2020న థియేటర్లో రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారు.

ఈమధ్య ఛానెల్స్ అన్నీ శాటిలైట్ రైట్స్ తో పాటు డిజిటల్ కూడా డీల్ చేస్తున్నాయి. అందుకే అమెజాన్ కు ఓకే చెప్పకుండా ఛానెల్స్ నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది యూనిట్. అయితే శాటిలైట్ రైట్స్ కింద నిర్మాతలు అడిగినంత ఇచ్చేందుకు ఛానెల్స్ సిద్ధంగా లేవు.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు శాటిలైట్ కింద 14 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు నిర్మాత. శాటిలైట్ డీల్ పక్కా అయిన తర్వాత అమెజాన్ పై ఓ క్లారిటీ వస్తుంది.

Related Stories