బిగ్ బాస్ 4 ఫినాలే రేటింగ్స్ అదుర్స్

Abhijeet

‘బిగ్ బాస్ 4’లో కంటెస్టెంట్ ల గురించి మొదట్లో చాలా విమర్శలు వచ్చాయి. ఒక్కరూ కూడా పాపులర్ కాదు. చాలా చీప్ గా ఉంది ప్రోగ్రాం అంటూ కొన్ని వెబ్ సైట్లు, మీడియా సంస్థలు తెగ విమర్శలు చేశాయి. తర్వాత తర్వాత ఈ ప్రోగ్రాంకి, కంటెస్టెంట్ ల ఆటకి వస్తున్న క్రేజ్ చూసి రోజు అదే ప్రోగ్రాం వార్తలు వండాయి.

అభిజీత్, హారిక, మోనాల్, అవినాష్, అరియానా, సోహైల్… అందరూ పాపులర్ అయ్యారు.

దానికి తగ్గట్లే ఈ షోకి రేటింగ్స్ వచ్చాయి. ఇక గ్రాండ్ ఫినాలేకి ఏకంగా 19.5 టీవీ రేటింగ్ వచ్చింది. అంటే… ఒక రికార్డ్. ఇంతకుముందు వచ్చిన మూడు సీజన్ల గ్రాండ్ ఫినాలే కన్నా అధికంగా రేటింగ్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా విచ్చేసి విన్నర్ ని ప్రకటించిన ఈ ఫినాలే అంత భారీ రేటింగ్ తెచ్చిపెట్టింది స్టార్ మాటివికి. అయితే, HD వర్షన్ తో కలిపితే, ఈ రేటింగ్ మరింతగా పెరిగింది. 21.7 TVR వచ్చింది.

ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5కి మరింతగా క్రేజ్ పెరగనుంది. సీజన్ 5కి వర్క్ మరో రెండు నెలల్లోనే స్టార్ట్ అవుతుంది.

More

Related Stories