‘బిగ్ బాస్’ సోహెల్ హీరోగా మూవీ!

Sohel

‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెజర్ కుక్కర్’ వంటి సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ అప్పి రెడ్డి మూడో సినిమా ప్రకటించారు. ‘బిగ్ బాస్ సీజన్ 4’తో అభిమానుల మనసులు కొల్లగొట్టిన సయ్యద్ సోహెల్ హీరోగా ఆయన కొత్త సినిమాని నిర్మిస్తున్నారు.

కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ మూవీకి డైరెక్టర్.

“ఈ సబ్జెక్ట్ సెన్సేషన్ క్రేయేట్ చేస్తుంది. నాకు తెలిసి ఇండియాలో ఇటువంటి కాన్సెప్ట్ మూవీ రాలేదు. సోహైల్ తో మేము బిగ్ బాస్ కంటే ముందే కలసి మాట్లాడడం జరిగింది. బిగ్ బాస్ ద్వారా సోహైల్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడు అయిపోయాడు. సోహైల్ కు ఇది బిగ్ గేమ్ చేంజర్ అవుతుంది,” అన్నారు నిర్మాత అప్పిరెడ్డి.

“నేను బిగ్ బాస్ కు వెళ్లకముందు కొన్ని సినిమాలు చేశాను. కానీ అవేవీ నాకు సరైన గుర్తింపునివ్వలేదు. బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఎలాంటి మూవీ చేస్తానా అని అందరూ ఎదురుచూస్తున్నారు. నిజంగానే ఈ కథ వేరేగా ఉంటది,” అన్నాడు సోహెల్.

More

Related Stories