‘బెల్ బాటమ్’తో డీలాపడ్డ బాలీవుడ్

Akshay Kumar in Bell Bottom


మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, అస్సాం మినహా నిన్న దేశమంతా విడుదలైంది అక్షయ్ కుమార్ నటించిన ‘బెల్ బాటమ్’. దాదాపు 800 థియేటర్లలో విడుదల చేశారు. కానీ మొదటి రోజు వచ్చిన కలెక్షన్… రెండున్నర కోట్ల రూపాయలు. అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్ నటించిన సినిమా దేశమంతా 2 కోట్ల రేంజులో కలెక్షన్ సాధించడం అంటే… హిందీ ధియేటరికల్ మార్కెట్ ఘోరమైన పరిస్థితిలో ఉంది.

ఈ సినిమా ఓపెనింగ్స్ చూసి బాలీవుడ్ మొత్తం ఢీలా పడింది. మహారాష్ట్ర మార్కెట్ ఓపెన్ కాకుండా సినిమాలు విడుదల చెయ్యడం శుద్ధ దండగ అని ఫిక్స్ అయిపోయారు డిస్ట్రిబ్యూటర్లు.

బాలీవుడ్ మార్కెట్ ఇప్పట్లో కోలుకునేలా లేదు. రెండేళ్లుగా బాలీవుడ్ లో పెద్ద సినిమాలు థియేటర్ వైపు ముఖం చూడలేదు. దేశంలో కరోనా రెండో వేవ్ తగ్గింది. కానీ జనం మాత్రం మునుపటిలా థియేటర్లో సినిమాలు చూసేందుకు క్రేజీగా లేరు. ఆ విషయం “బెల్ బాటమ్” విడుదల తర్వాత అర్థమైంది. అందుకే. బాలీవుడ్ పెద్ద సినిమాలు మరి కొంత కాలం ఆగుతాయి.

Advertisement
 

More

Related Stories