‘స్టూవ‌ర్టుపురం దొంగ‌’గా బెల్లంకొండ

‘స్టూవ‌ర్టుపురం దొంగ‌’ కథలకి ఇప్పుడు తెలుగులో బాగా డిమాండ్ కనిపిస్తోంది. ఇప్పటికే రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ పేరుతో ఒక సినిమాని ప్రకటించారు. ఇప్పుడు యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి అదే కథ రాబోతోంది. శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రం పేరు ‘స్టూవ‌ర్టుపురం దొంగ‌’. ‘బయోపిక్ ఆఫ్ టైగర్’ అనేది ట్యాగ్ లైన్. కె.ఎస్‌.ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి బెల్ల‌కొండ సాయి శ్రీనివాస్ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు కెమెరా అందిస్తారట.

“1980లలో పేరు మోసిన గ‌జ‌దొంగ నాగేశ్వ‌ర‌రావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నా,”మని నిర్మాత ఒక ప్రకటనలో తెలిపారు. అంటే, రవితేజ ప్రకటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా కథ, బెల్లంకొండ ప్రకటించిన ‘స్టూవ‌ర్టుపురం దొంగ‌’ కథ ఒక్కటే. టైగర్ నాగేశ్వరరావుగా పేరొందిన ఆ స్టూవర్టుపురం దొంగ జీవిత కథలోనే ఈ హీరోలిద్దరూ నటిస్తున్నారన్నమాట.

బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. అది పూర్తి కాగానే ఈ ‘స్టూవ‌ర్టుపురం దొంగ‌’గా మారిపోతాడట.

Advertisement
 

More

Related Stories