బెంగుళూరులో తెలుగు మూవీస్ రిలీజ్

ఈరోజు అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అదేంటి.. అల్లు అర్జున్ సినిమా ఇంకా సెట్స్ పైన ఉంది. మహేష్ బాబు మూవీ ఇంకా సెట్స్ పైకి కూడా వెళ్లలేదు. అంతలోనే రిలీజ్ ఏంటని అనుకుంటున్నారా?

మహేష్-బన్నీ సినిమాలు ఈరోజు నిజంగానే రిలీజ్ అయ్యాయి. కాకపోతే అవి కొత్త సినిమాలు కావు. ఈ సంక్రాంతికి రిలీజైన “సరిలేరు నీకెవ్వరు”, “అల వైకుంఠపురములో” సినిమాలు ఈరోజు మళ్లీ ఫ్రెష్ గా థియేటర్లలోకి వచ్చాయి.

అన్ లాక్ 5.Oలో భాగంగా ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకోవచ్చని కేంద్రం పర్మిషన్ ఇచ్చేసింది. ఇందులో భాగంగా బెంగళూరులో కొన్ని సినిమా హాళ్లు ఓపెన్ చేశారు. వాటిలో మహేష్, బన్నీ మూవీస్ తో పాటు నితిన్ నటించిన ‘భీష్మ’ సినిమాను రీ-రిలీజ్ చేశారు. ఈ మేరకు బుక్ మై షో సైట్ లో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.

తెలంగాణలో మాత్రం ఎక్కడా థియేటర్లు తెరుచుకోలేదు. వర్షాలతో తెలంగాణ అల్లాడుతోంది.

ఇక 50శాతం ఆక్యుపెన్సీతో సింగిల్ స్క్రీన్స్ తెరిచేది లేదని ఇప్పటికే ఏపీలోని ఎగ్జిబిటర్లు తీర్మానించారు. ఐతే, వైజాగ్ లో మాత్రం జగదాంబ వంటి కొన్ని థియేటర్లు ఓపెన్ అయ్యాయి. లాక్ డౌన్ టైమ్ లో వచ్చిన కరెంట్ బిల్లుల్ని ప్రభుత్వం మాఫీ చేయాలని కోరుతున్నారు ఏపీలోని ఎగ్జిబిటర్లు

Related Stories