- Advertisement -

“భాగమతి” సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారనేది ఓల్డ్ న్యూస్. అనుష్క తెలుగులో పోషించిన పాత్రని బాలీవుడ్ లో భూమి పడనేకర్ యాక్ట్ చేస్తోంది. తెలుగులో డైరెక్ట్ చేసిన జి అశోక్ ఈ మూవీని హిందీలో కూడా డైరెక్ట్ చేశాడు. హిందీ వర్షన్ కి పేరు మార్చారు. “దుర్గమతి” అనే టైటిల్ ఫిక్స్ అయింది.
నిజానికి ఈ సినిమాకి మొదట అనుకున్న పేరు.. దుర్గావతి. ఐతే “పద్మావతి” సినిమా విషయంలో జరిగిన రగడ చూసి ఇప్పుడు “దుర్గమతి” అని మార్చారు..భాగమతి సౌండింగ్ లా. తెలుగులో అనుష్క నటించిన సినిమా బాగా ఆడింది.
మొదట అనుకున్న టైటిల్ “రాణి దుర్గావతి” అనే ఫేమస్ రాణి పేరుని తలపిస్తోంది కాబట్టి గొడవ అవుతుందనే ఉద్దేశంతో మార్చేశారు. ఈ సినిమా డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 11న విడుదల కానుంది.