మిలియన్ మార్క్ కి చేరువలో

- Advertisement -
Bhagavanth Kesari

దసరా కానుకగా విడుదలైన “భగవంత్ కేసరి” స్లో అండ్ స్టడీగా సాగుతోంది. సాధారణంగా బాలయ్య సినిమాలకు కనిపించే పెద్ద ఊపు బాక్సాఫీస్ వద్ద లేదు. ఐతే, టాక్ మాత్రం బాగుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కి నచ్చేలా ఉన్న కంటెంట్ కారణంగా నెమ్మదిగా అయినా నిలబడుతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక అమెరికాలో ఈ సినిమా వసూళ్లు స్టడీగా వెళ్తున్నాయి. ఈ వీకెండ్ పూర్తి అయ్యేసరికి 1 మిలియన్ మార్క్ దాటుతుంది. ఇప్పటివరకు $800k (8 లక్షల డాలర్లు) పొందింది. “వీరసింహరెడ్డి”, “అఖండ” వంటి హిట్ చిత్రాలు కూడా కేవలం 1 మిలియన్ల వసూళ్లు మాత్రమే పొందాయి. ఆ లెక్కన చూస్తే ఈ సినిమా మొదటి ఐదు రోజుల్లోనే 1 మిలియన్ మార్క్ దాటేస్తుంది.

మరోవైపు, దసరా పండగ సమయంలో బాలయ్య మరోసారి సినిమా కోసం ప్రమోషన్ చేస్తారట.

ప్రస్తుతం ఈ సినిమా టీంకి సంబంధించి దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీలీల పబ్లిసిటీ కల్పిస్తున్నారు.

 

More

Related Stories