
నటి భాగ్యశ్రీ ఇప్పటికే తల్లి పాత్రల్లోకి వచ్చేశారు. ‘తలైవి’ సినిమాలో కంగనకి తల్లిలా నటించింది ఆవిడే. ఇప్పుడు ప్రభాస్ కి తల్లిగా మెప్పించనున్నారు. 50 ప్లస్ ఏజ్ లో కూడా అందంగా కనిపిస్తూ, సోషల్ మీడియాలో తన ఫోటోషూట్ ఫొటోలతో హడావిడి చేస్తుండే భాగ్యశ్రీ తల్లి పాత్రలు చేస్తుండడం సర్ప్రైజ్ చేస్తోంది. కానీ, తనకి తల్లి పాత్రలు పోషించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.
ప్రభాస్ పై ఆమె పొగడ్తల వర్షం కురిపించారు. “ప్రభాస్ కి దేశమంతా క్రేజ్ ఉంది. అంత పెద్ద స్టార్ అయినా అతనిలో గర్వం లేదు. తోటి నటీనటులతో అతను మెలిగే తీరు, అతని సింప్లిసిటీ, మంచి స్వభావం నాకు బాగా నచ్చాయి,” అని భాగ్యశ్రీ మురిసిపోతూ చెప్పారు.
ఈ నెల 11న విడుదల కానున్న ‘రాధేశ్యామ్’ సినిమాలో ఆమె ప్రభాస్ కి తల్లిగా నటించారు.
‘మైనే ప్యార్ కియా’ సినిమాతో అప్పట్లో కుర్రకారుకి గిలిగింతలు పెట్టారు. కానీ, ఆమె హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు చెయ్యలేదు. పెళ్లి చేసుకొని వెంటనే సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు ఆమె కొడుకు, కూతురు కూడా సినిమాల్లోకి అడుగుపెట్టారు. దాంతో, ఆమె కూడా నటిగా మళ్ళీ బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
తల్లి పాత్రలే కాదు నటనకు ఆస్కారం ఉండే పాత్రలేవైనా చేస్తాను అని చెప్తున్నారు.