భైరవ గుర్తుండిపోతాడు: స్వప్న దత్

Kalki 2898 AD

“కల్కి 2898 AD” సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు… భైరవ. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ. 2898వ సంవత్సరంలో కాశీ నగరం ఎలా ఉంటుందో మనం చూడబోతున్నాం. ఈ సినిమా కథ కాశీ నేపథ్యంగా సాగుతుంది.

ఈ సినిమా గురించి సహ నిర్మాత స్వప్న దత్ తాజాగా ఒక ఈవెంట్ లో మాట్లాడారు. “ప్రభాస్ పోషించిన భైరవ పాత్ర ప్రత్యేకం. ఈ పాత్ర కొన్నేళ్లపాటు మనల్ని వెంటాడుతుంది. ప్రభాస్ కెరీర్ లో గొప్ప పాత్రల్లో ఒకటిగా మిగిలిపోతుంది,” అని ఆమె చెప్పారు.

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ఇది. అశ్వనీ దత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కానీ నిర్మాణ బాధ్యతలు అన్నీ ఆయన కూతురు స్వప్న దత్ చూసుకుంటున్నారు.

ఈ సినిమా మే 9న విడుదల కావాలి. కానీ ఎన్నికల కారణంగా వాయిదా వేశారు. ఐతే, స్వప్న దత్ విడుదల తేదీ గురించి కానీ, వాయిదా గురించి కానీ స్పందించలేదు.

తెలుగులో కొన్ని సైన్స్ ఫిక్షన్ చిత్రాలు వచ్చాయి. కానీ ఇది మాత్రం ఇప్పటివరకు ఏ తెలుగు, హిందీ దర్శకుడు తీయని విధంగా ఉంటుందట. “విజువల్స్ చూసినప్పుడు అందరి మతి ఎగిరిపోతుంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్, కథ, కథనాలతో పాటు ప్రభాస్ పాత్ర, ఆయన నటన మన మనస్సులో నిలిచిపోతుంది,” అని ఆమె చెప్పారు.

Advertisement
 

More

Related Stories