‘భారతీయుడు 3’ దానికోసమేనా?

- Advertisement -
Kamal Haasan and Shankar

లోకనాయకుడు కమల్ హాసన్ వయస్సు ఇప్పుడు 69 ఏళ్ళు. కానీ 50 ఏళ్ళుగా నటుడిగానే కొనసాగుతున్నారు. ఒకప్పుడు కమల్ హాసన్ తన మిత్రుడు రజినీకాంత్ తో కలిసి తమిళ చిత్ర సీమని ఊపేశారు. అగ్ర హీరోగా కోట్ల రూపాయలు ఆర్జించారు. ఆస్తులూ సంపాదించారు. ఐతే, కొన్నేళ్ల క్రితం రకరకాల కారణాలతో చాలా పోగుట్టుకున్నారు. అప్పుల బాధలూ పెరిగాయి. నటించిన ఏ సినిమా ఆడలేదు.

లేట్ వయసులో కమల్ హాసన్ చాలా ఆర్థిక సంక్షోభం చూశారు. దాంతో, “బిగ్ బాస్” షో ఒప్పుకున్నారు. దాంతో కొంత ఆర్థికంగా కలిసొచ్చింది. ఇక “విక్రమ్” సినిమా రికార్డు విజయం సాధించడంతో ఒక్కసారిగా కమల్ హాసన్ సినిమాలకు మళ్ళీ క్రేజ్ పెరిగింది. థియేటర్, నాన్ థియేటర్ డీల్స్ పెరిగాయి. దాంతో, ఆయన పారితోషికం కూడా భారీగా పెరిగింది.

ఇప్పుడు కమల్ హాసన్ తెగ సంపాదించే పనిలో పడ్డారు. అందుకే, “భారతీయుడు 2” సినిమాకి కూడా ఇంకో భాగం మొదలుపెట్టారు. అంటే మూడో భాగంతో అదనంగా కమల్ హాసన్ కి మరో 60, 70 కోట్లు వస్తాయి. సులువుగా సంపాదించే మార్గం ఇది. అందుకే ఆయన రెండో భాగంతో పాటు మూడో భాగం మొదలుపెట్టారు ‘భారతీయుడు’ చిత్రానికి.

ఇక తాను హీరోగా మణిరత్నం కాంబినేషన్ లో “థగ్ లైఫ్” అనే సినిమా స్టార్ట్ చేశారు.

శివకార్తికేయన్ వంటి ఇతర హీరోలతో నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్నారు. హీరోగా, నిర్మాతగా, టీవీ హోస్ట్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా ఇప్పుడు కమల్ హాసన్ ఇబ్బడిముబ్బడిగా సంపాదిస్తున్నారు. ఇప్పటికే చాలా అప్పులు తీర్చేశారు. ఇప్పుడు మళ్ళీ భారీగా డబ్బు కూడబెట్టేపనిలో పడ్డారు.

 

More

Related Stories