రెండేళ్లా? ఇంకా లేటా?

Harish Shankar and Pawan Kalyan

దర్శకుడు హరీష్ శంకర్ ఇంకా ఆశ వదులుకోలేదు. పవన్ కల్యాణ్ తో తీయాలనుకున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా విషయంలో ఆయన ఇంకా నమ్మకంగానే ఉన్నారు. ఈ ఏడాది చివర్లోనో, వచ్చే ఏడాదో మొదలవుతుంది అని అనుకుంటున్నారు. కానీ, పవన్ రాజకీయాలు, ఆయన ప్రణాళికలు వేరు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమా ఇప్పట్లో మొదలు కాదని తెలుగుసినిమా.కామ్ కి ఉన్న సమాచారం. పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’, ‘వినోదయ సైతం’ రీమేక్ తప్ప మిగతా సినిమాల గురించి ఇప్పట్లో పట్టించుకోరు. ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాను త్వరలోనే చేయబోతున్నానని పవన్ స్వయంగా ఎనౌన్స్ చేశారు ఇటీవల. కానీ, ఆయన రాజకీయ యాత్రలు కూడా త్వరలోనే స్టార్ట్ కానున్నాయి. అంతే, ‘భగత్ సింగ్’కి పవన్ వద్ద టైం లేదు.

అలాగని, ఈ సినిమా అటకెక్కలేదు. ఎప్పుడో ఒకప్పుడు ప్రారంభం అవుతుంది. కానీ ఎప్పుడు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. కనీసం రెండేళ్లు పట్టొచ్చని అంచనా.

ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ మరో హీరోతో మూవీ చేసుకోవాలి.

 

More

Related Stories