భీమ్లానాయక్ టికెట్ ఇష్యు లేదిక

- Advertisement -
Bheemla Nayak


‘భీమ్లా నాయక్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్న దిల్ రాజు – శిరీష్ ‘బుక్ మై షో’ ద్వారా టికెట్లు అమ్మలేమని చెప్పారు. టికెట్ రేట్ మీద 20 నుంచి 30 రూపాయల వరకు కన్వీనియన్స్ ఫీజు రూపంలో బుక్ మై షో తీసుకుంటోంది. దాన్ని తగ్గించాలని తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్ చేస్తున్నారు.

ఆ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. కానీ ‘భీమ్లానాయక్’ టికెట్లు కావాలని అభిమానుల గోల, నిర్మాతల ఒత్తిడి కారణంగా ఈ సినిమాకి వదిలేశారు. ఇప్పుడు బుక్ మై షో యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. తర్వాత పెద్ద సినిమాలు విడుదల అయ్యేలోపు చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

తెలంగాణాలో ‘భీమ్లా నాయక్’ అడ్వాన్స్ బుకింగ్ చాలా లేట్ గా ఓపెన్ అయింది. అభిమానులు పెద్ద గోల చేశారు. దాంతో, చర్చలు కొలిక్కి రాకముందే మళ్ళీ బుక్ మై షో ద్వారా బుకింగ్ ప్రారంభించారు.

More

Related Stories