అధికారుల ‘థియేటర్ల పర్యటన’

- Advertisement -
Bheemla Nayak

పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఐతే, ఏపీలో మాత్రం ఈ సినిమా థియేటర్ల వద్ద వింత పరిస్థితి చోటుచేసుకొంది. బెనిఫిట్ షోలు వెయ్యొద్దని ఇంతకుముందే ప్రభుత్వం హెచ్చరించింది. దాంతో, అధికారికంగా ఉదయం షోలు ఎక్కడా పడలేదు ఏపీలో. ఎవరు నిబంధనలు ఉల్లంఘించకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు కూడా చేపట్టింది.

ప్రతి థియేటర్ కి ప్రభుత్వం అధికారులను పంపించి పర్యవేక్షించేలా చెయ్యడం విచిత్రం. అనేక పట్టణాలు, నగరాల్లో థియేటర్ల వద్ద రెవెన్యూ, పోలీసు అధికారుల సందడి కనిపించింది. ఎలక్షన్ డ్యూటీలా ఒక్కో థియేటర్ కి కొందరు అధికారులను కేటాయించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో, ఈ విషయంలో ప్రభుత్వం వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు విడుదల రోజు అర్ధరాత్రి నుంచే షోలు పడుతాయి. ఈ పద్దతి ఆంధ్రప్రదేశ్ లో దశాబ్దాలుగా ఉంది. ఇటీవల వై.ఎస్.జగన్ ప్రభుత్వం ఈ పద్దతికి స్వస్తి పలికే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసిన ఏపీ ప్రభుత్వం థియేటర్లలో టికెట్ రెట్లని తగ్గించింది. ఇటీవల ప్రభుత్వం, ఇండస్ట్రీ పెద్దలతో చర్చలు జరిపి టికెట్ రేట్లు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ, ‘భీమ్లానాయక్’కి ఆ లాభం కలగకుండా కొత్త జీవోని ఇంకా విడుదల చెయ్యాలని అంటున్నారు.

టికెట్స్ ను నిర్ణయించిన ధరకే అమ్మేలా చేసింది. నిబంధనలు ఉల్లంగిస్తే థియేటర్‌ని సీజ్ చేయాలని ఆదేశాలు వెళ్లాయి. జాయింట్ జిల్లా కలెక్టర్లు, విఆర్వోలు , పోలీసులు, గ్రామ వాలంటీర్లు… ఇలా అందరూ థియేటర్ల పర్యటన చేశారు రోజంతా.

 

More

Related Stories