నాది జనం జోనర్: భీమ్స్

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన కొత్త చిత్రం ‘ధమాకా’. ఈ సినిమాలో రెండు పాటలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. భీమ్స్ సిసిరోలియో దీనికి సంగీత దర్శకుడు. ఇంతకుముందు రవితేజ నటించిన ‘బెంగాల్ టైగర్’కి కూడా పాటలు అందించాడు.

“రవితేజ నాకు రెండో అవకాశం ఇచ్చారు. దాన్ని మర్చిపోను. ఇప్పుడు పాటలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ‘ధమాకా’కి ఖచ్చితంగా రీసౌండ్ వస్తుందనే నమ్మకం వుంది. ఈ సినిమాకి పాటలు చేశానని చెప్పడం కంటే రవితేజ గారి పూజ చేశానేమో అనిపిస్తుంది,” అని అన్నారు భీమ్స్.

రవితేజ ఇందులో రెండు పాత్రలు పోషిస్తున్నారు. “రెండు పాత్రలకు తగ్గట్టు పాటలు డిజైన్ చేశా. ‘ధమాకా’లో మొత్తం ఐదు పాటలు ఉండగా ఇప్పటి వరకు జింతాక్, వాట్స్ హ్యాపెనింగ్, మాస్ రాజా, డుడు అనే నాలుగు పాటలు విడుదలయ్యాయి. అన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో పాట నేనే రాసి పాడాను. అది త్వరలోనే విడుదల అవుతుంది,” అని భీమ్స్ చెప్పారు.

మీరు రచనలు కూడా చేస్తారా? “రచయితగానే ప్రయాణం మొదలుపెట్టాను. కానీ ఎవరూ గుర్తించలేదు. “జింతాక్” పాటతో గుర్తింపు వచ్చింది. నాది ఒకే ఒక్క జోనర్ ..జనం జోనర్.”

Advertisement
 

More

Related Stories