
కార్తీ నటించిన ‘ఖైదీ’ తమిళంలో, తెలుగులో సంచలన విజయం సాధించింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి బాగా పేరు తీసుకొచ్చిన చిత్రం ఇది. కథ కన్నా అతని మేకింగ్, గ్రిప్పింగ్ నేరేషన్ మెప్పించింది. పూర్తిగా ఒక రాత్రి జరిగే ఈ కథని తీసుకొని తనదైన శైలిలో చెప్పేందుకు ప్రయత్నించారు హీరో కమ్ డైరెక్టర్ అజయ్ దేవగన్.
‘భోళా’ పేరుతో అజయ్ దేవగన్ హిందీలో రీమేక్ చేశారు. శ్రీరామనవమి కానుకగా గురువారం విడుదలైంది. కానీ ఈ సినిమాకి సరైన ఓపెనింగ్ రాలేదు. ఇక రెండో రోజు ఈ సినిమాకి వసూళ్లు బాగా తగ్గాయి. ఈ శని, ఆదివారాలు పుంజుకుంటే తప్ప ఈ సినిమా గట్టెక్కడం కష్టం.
అజయ్ దేవగన్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయన ఇటీవల నటించిన ‘దృశ్యం 2’ భారీ విజయం సాధించింది. ఆయన కీలక పాత్రలు పోషించిన ‘ఆర్ ఆర్ ఆర్’, ‘గంగూబాయి’ వంటివి కూడా హిట్ అయ్యాయి. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్నా… ఈ సినిమాకి గట్టి ఓపెనింగ్ రాలేదు.
‘ఖైదీ’ సినిమాలో టైట్ నేరేషన్ కనిపిస్తుంది. ‘భోళా’లో అజయ్ దేవగన్ మరింతగా మాస్ పద్దతిలో చెప్పారట.