
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం చాలామందిని కలచివేసింది. అందులో ఒకరు భూమిక. సుశాంత్, భూమిక కలిసి ఎమ్మెస్ ధోనీ సినిమా చేశారు. నిజానికి ఈ సినిమాలో భూమికది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు, సుశాంత్ తో కలిసి నటించింది కూడా చాలా తక్కువ. సింగిల్ కాల్షీట్ లో తామిద్దరి మధ్య షూటింగ్ పూర్తయిందని గతంలోనే భూమిక చెప్పుకొచ్చింది.
సుశాంత్ మరణంపై తీవ్ర విచారాన్ని వ్యక్తంచేసిన భూమిక తాజాగా మరోసారి అతడిపై స్పందించింది. సుశాంత్ కు నివాళులు అర్పిస్తూ, అతడి జ్ఞాపకాల్ని మరోసారి గుర్తుచేసుకుంటూ సుదీర్ఘంగా పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ తో అతడికి ఫైనల్ గుడ్ బై చెప్పింది భూమిక.
సుశాంత్ లేకుండా 20 రోజులు గడిచిపోయాయని, ఈరోజు కూడా అతడి ఆలోచనలతోనే నిద్రలేచానని రాసుకొచ్చిన భూమిక.. తన మనసులో ఉన్న భావాలన్నీ అందులో పెట్టింది. ఇది డిప్రెషన్ కాదని, సుశాంత్ పై తనకున్న అభిమానమని చెప్పుకొచ్చింది.