“బిచ్చగాడు 2″కి రిలీజ్ డేట్

“బిచ్చగాడు” ఈ పేరుతో సినిమా తీయొచ్చు. హిట్ కొట్టొచ్చు అని విజయ్ ఆంటోని నిరూపించారు. ఆ సినిమాతో స్టార్ అయ్యారు విజయ్ ఆంటోని. తమిళనాడులోనే కాదు తెలుగునాట కూడా క్రేజ్ తెచ్చుకున్నారు.

ఐతే ఇటీవల విజయ్ ఆంటోనీ సినిమాలు ఆడడం లేదు. దాంతో, ఆ సినిమాకి సీక్వెల్ తీశారు.

“బిచ్చగాడు” చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న “బిచ్చగాడు 2″కి ఇప్పుడు రిలీజ్ డేట్ కుదిరింది. ఏప్రిల్ 14 న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

ఫాతిమా నిర్మిస్తుండగా విజయ్ ఆంటోనీ కథ, దర్శకత్వంతో పాటు సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలూ నిర్వహిస్తున్నారు. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్. ఐతే, ఈ సినిమా విడుదల తేదీ కోసం రిలీజ్ చేసిన పోస్టర్ ‘కాంతార’ టైప్ లో ఉంది. ‘కాంతర’ క్రేజ్ ని క్యాష్ చేసుకొనే పనిలో పడ్డారన్నమాట.

 

More

Related Stories