బిగ్ బెన్ 6వ చిత్రం షురూ

“పెళ్లి చూపులు”, “డియర్ కామ్రేడ్”, “దొరసాని” వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ సంస్థ తన 6వ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించింది. యష్ రంగినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతన్య రావ్, లావణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఓ పిట్ట కథ’ చిత్రంతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చెందు ముద్దు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో శుక్రవారం ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.

నిర్మాత యష్ రంగినేని

“మా మొదటి సినిమా పెళ్లి చూపులు విడుదలైన తేదీ జూలై 29. అదే రోజున మా కొత్త చిత్రాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఆగస్ట్ 1 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. అమలాపురం, అరకు ప్రాంతాల్లో దాదాపు నెల రోజులు షూటింగ్ చేస్తాం. ఆ తర్వాత సెప్టెంబర్ లో కేరళ షెడ్యూల్ ఉంటుంది. అక్టోబర్ కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేసేందుకు ప్రయత్నిస్తాం.”

హీరో చైతన్య రావ్

చెందు ముద్దు తీసిన ఓ పిట్ట కథ సినిమా నాకు బాగా నచ్చింది. నా మనసుకు దగ్గరైన సినిమా ఇది. ఈ సబ్జెక్ట్ విన్నాక నా కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది అనిపించింది.

దర్శకుడు చెందు ముద్దు

విలేజ్ బ్యాక్ డ్రాప్ కథ ఇది. మా టీమ్ అంతా దాదాపు కొత్తవాళ్లం. ఒక కొత్త తరహాలో, ప్రయోగాత్మక పద్ధతిలో ఈ సినిమా మేకింగ్, లొకేషన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. ఒక హిట్ సినిమాను మా నిర్మాత యష్ గారికి ఇవ్వబోతున్నాం.

 

More

Related Stories