ప్రభాస్ మూవీకి మళ్లీ భారీగా ఖర్చు

Prabhas in Radhe Shyam

ఉన్నది ఒకే ఒక్క ఫైట్. పైగా ప్రేమకథా చిత్రంలో యాక్షన్ సీన్ కు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ ”రాధేశ్యామ్” యూనిట్ మాత్రం తగ్గడం లేదు. తమ సినిమాలో ఉన్న ఒకే ఒక్క ఫైట్ కోసం అక్షరాలా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధపడుతోంది.

అవును.. ”రాధేశ్యామ్” సినిమాలో కేవలం ఒకే ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ నిక్ పోవెల్ ను రంగంలోకి దించారు. గతంలో ఇతడు ”గ్లాడియేటర్”, ”బార్న్ ఐడెంటిటీ” లాంటి సినిమాలకు ఫైట్స్ కంపోజ్ చేశాడు.

ప్రభాస్ సినిమాల్లో యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఇలా కోట్లు ఖర్చు చేయడం కొత్తేంకాదు.

”సాహో” సినిమాలో కేవలం యాక్షన్ సీన్స్ కే 50 కోట్ల రూపాయల వరకు ఖర్చుచేశారు. అదంటే కంప్లీట్ యాక్షన్ మూవీ. ఎంత ఖర్చు చేసినా తప్పులేదు. కానీ లవ్ స్టోరీగా వస్తున్న ”రాధేశ్యామ్” లాంటి సినిమా కోసం, అందులోని ఒకే ఒక్క ఫైట్ కోసం 2 కోట్లు ఖర్చు చేయడం కాస్త అతిగానే అనిపిస్తోంది.

Related Stories