బిగ్ బాస్ 4 విన్నర్ తేలేది రేపే

- Advertisement -

ఇప్పటికే ప్రపంచం అంతా కోడై కూస్తోంది …బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ అని. ఐతే, నిజంగా అతనే విన్నర్ గా తేలుతాడా అంటే ఖచ్చితంగా చెప్పలేం. వోటింగ్ మాత్రమే డిసైడ్ చేస్తుంది ఎవరు విన్నర్ అనేది. నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన వోటింగ్ లో ఎవరికి ఎక్కువగా ఓట్లు పడ్డాయి అనేది ఆదివారం సాయంత్రానికి కానీ తేలదు.

ఈ రోజు ఆల్రెడీ ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలు అవుతుంది. అదంతా శనివారమే షూటింగ్ పూర్తి అవుతుంది. కానీ విజేత ఎవరు అనే విషయాన్నీ ప్రకటించేది రేపే షూట్ చేసి ప్రసారం చేస్తారు. అవును.. రేపే గ్రాండ్ ఫినాలే. మెగాస్టార్ చిరంజీవి అతిధిగా విచ్చేసి విన్నర్ ని ప్రకటిస్తారు. ఇప్పటివరకు జనం ఫేవరేట్ అభిజిత్.

ఇంతకీ ఎవరీ అభిజీత్?
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అభిజీత్… శేఖర్ కమ్ముల తీసిన “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో చిన్న పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ నేడు హీరోగా పెద్ద రేంజులో ఉన్నాడు. కానీ మెయిన్ హీరోగా నటించిన అభిజీత్ మాత్రం సక్సెస్ కాలేదు. “రామ్ లీల”, “మిర్చి లాంటి కుర్రాడు” అనే సినిమాలు చేసినా గుర్తింపు రాలేదు. అతన్ని దాదాపుగా అందరూ మర్చిపోయారు.

అలాంటి హీరోని బిగ్ బాస్ టీం గుర్తుపెట్టుకొని మరి తీసుకోవడమే ఒక వండర్. అతను ఇప్పుడు యమా పాపులారిటీ తెచ్చుకోవడం మరో వండర్.

 

More

Related Stories