గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’

- Advertisement -
Bigg Boss fame Gautam Krishna

బిగ్ బాస్’లో కనిపించిన వాళ్ళు హీరోలుగా మారుతున్నారు. ఇప్పుడు అది ట్రెండ్. ఈ కోవలో వస్తున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్… గౌతమ్ కృష్ణ. అతను బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నాడు.

తాజాగా గౌతమ్ కృష్ణ ప్రధాన పాత్రల్లో ఒక సినిమా రూపొందుతోంది. దానికి “సోలో బాయ్” అనే టైటిల్ ఖరారు చేశారు. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెవెన్ హిల్స్ సతీష్ నిర్మించారు. పి. నవీన్ కుమార్ దర్శకత్వం వహించారు.

“కోవిడ్ టైంలో నేను ‘బట్టల రామస్వామి బయోపిక్’ అనే సినిమా తీశాను. ఇప్పుడు ఈ తరం ప్రేక్షకులకు నచ్చేలా సోలో బాయ్ నిర్మిస్తున్నాను,” అని అన్నారు నిర్మాత సతీష్. “ఈ రోజు మా సినిమా “సోలో బాయ్” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది. గతంలో ప్రేక్షకులు నన్ను ఆకాశవీధిలో, బిగ్ బాస్ తో ఎలా ఆదరించారో ఇప్పుడీ సినిమాతో కూడా అలాగే ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను,” అని అన్నారు హీరో గౌతమ్ కృష్ణ.

గౌతమ్ కృష్ణ సరసన శ్వేతా అవ్వాస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా నటించారు.

 

More

Related Stories