
బిగ్ బాస్ కొత్త రూపంలో మన ముందుకొస్తోంది. డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ (Bigg Boss Nonstop) పేరుతో ఈ షో స్ట్రీమ్ కానుంది. ఈ నెల 26 నుంచి 24 గంటల వినోదమే.
ఇప్పటికే దాదాపు 20 మంది వరకు కంటెస్టెంట్ లను తీసుకున్నారు. అందరిని ప్రస్తుతం క్వారెంటైన్ లో ఉంచారు. వేర్వేరు హోటళ్లలో ఐసోలేషన్ లో ఉన్న కంటెస్టెంట్లలో 18 మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారు. 18 మంది కంటెస్టెంట్ లతో ఈ షో మొదలవుతుంది.
ఇప్పటికే తేజస్వి, ముమైత్ ఖాన్, అరియనా గ్లోరీ, నటరాజ్ మాస్టర్ పేర్లు లీకు అయ్యాయి. వీరు ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్ లలో పాల్గొన్నారు. మళ్ళీ ఓటిటి కోసం సిద్ధమయ్యారు.
Bigg Boss Nonstop ప్రత్యేకత ఏంటంటే… ఈ కార్యక్రమాన్ని 24 గంటలు చూడొచ్చు ప్రేక్షకులు. ఎప్పటిలాగే, నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తారు. ఇప్పటికే, నాగార్జున, వెన్నెల కిషోర్ లపై తీసిన ప్రోమో స్టార్ మా లో ప్రసారం అవుతోంది.