బిగ్ బాస్ సోహైల్ సినిమా షురూ

- Advertisement -
Sohail

‘బిగ్ బాస్ సీజన్ 4’లో కనిపించి పాపులర్ అయ్యాడు సోహైల్. అతను హీరోగా సినిమా మొదలైంది. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రజర్ కుక్కర్’ లాంటి చిత్రాలు నిర్మించిన అప్పిరెడ్డి కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటిని పరిచయం చేస్తూ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది ఈ సినిమా.

“ఇప్పటివరకు భారతదేశ చిత్ర చరిత్రలో రాని ఓ కొత్త పాయింట్ తో ఈ సినిమా ఉంటుంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాం,” అంటున్నారు నిర్మాత.

బిగ్ బాస్ సీజన్ 4 విజేత అభిజిత్ కి ఇంకా సినిమా ఆఫర్లు రాలేదు. కానీ ఇతర కంటెస్టెంట్ లు మాత్రం అవకాశాలను దక్కించుకుంటున్నారు.

More

Related Stories