ఇది నా లవ్ స్టోరీ

Divi

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయి, బాహ్యప్రపంచంలోకి వచ్చిన దివి, ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రిటీ అయిపోయింది. వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇందులో భాగంగా తన లవ్ ఎఫైర్, అది ఎలా బ్రేకప్ అయిందనే వివరాల్ని కూడా బయటపెట్టింది ఈ చిన్నది.

చాలా రోజుల కిందటే, ఇంకా చెప్పాలంటే సినీ కెరీర్ ప్రారంభించకముందే ఎఫైర్ లో ఉందట దివి. కాకపోతే అప్పట్లో ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమెను పట్టించుకోలేదట. వ్యాపారంలో మునిగిపోయి దివిని పూర్తిగా కేర్ చేయడం మానేశాడట.

అలా తను, తన బాయ్ ఫ్రెండ్ విడిపోయామని.. ఆ తర్వాత తను ప్రతి రోజూ ఏడ్చానని చెప్పుకొచ్చింది దివి.

Divi Vadthya

తర్వాత మోడలింగ్, సినీ ఇండస్ట్రీలోకి వెళ్తూ పాత గాయాల నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చింది. ఇక తనకు కాబోయే భర్త గురించి స్పందిస్తూ.. తనకు కాబోయే వాడికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలని, తన కోసం వంట చేసి పెట్టాలని చెబుతోంది.

Related Stories