- Advertisement -

Bigg Boss Telugu 4 – Episode 4
బిగ్ బాస్ మొదలై జస్ట్ 4 ఎపిసోడ్స్ మాత్రమే పూర్తయ్యాయి. మూడో ఎపిసోడ్ లో కనీసం కట్టప్ప ఎపిసోడ్ అయినా పండింది. నాలుగో ఎపిసోడ్ లో అది కూడా లేదు. ఒకర్ని మించి ఒకరు ఓవరాక్షన్ చేయడం, సందర్భం లేకుండా ఏడుపు స్టార్ట్ చేయడం చేశారు. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రేక్షకుడు బిక్కమొహం పెట్టాడు.
ఇక Bigg Boss Telugu 4 – Episode 4 హైలెట్స్ విషయానికొస్తే.. సీక్రెట్ నుంచి సోహైల్, అరియానా బయటకొచ్చారు. తమకు ఎందుకు ఫుడ్ పంపించలేదని గొడవ పెట్టుకున్నారు. ఎపిసోడ్ 4లో కూడా గంగవ్వ మెరుపులు కనిపించాయి.
డంబెల్ తో ఎక్సర్ సైజ్ చేయడం, అరియానాపై పంచ్ లు వేయడం ఉన్నంతలో ప్రేక్షకులకు ఆసక్తి రేకెత్తించాయి. ఇవి మినహా ఎపిసోడ్ -4లో ఎలాంటి టిస్టులు, మెరుపులు లేవు.