ఆమె నోరు తెరిచింది

Divi Vadthya

Bigg Boss Telugu 4 – Episode 5
బిగ్ బాస్ సీజన్-4 మొదలైనప్పట్నుంచి సైలెంట్ గా ఎవరైనా ఉన్నారంటే అది దివి మాత్రమే. హౌజ్ లోకి వెళ్లేముందు ఐటెంసాంగ్ తో రచ్చ చేసిన ఈ బ్యూటీ.. ఎంటరైన తర్వాత మౌనవ్రతం పట్టింది. పెద్దగా ఎందులో కలవలేదు. అలా 4 రోజులుగా కామ్ గా ఉన్న దివి, ఐదో రోజు నోరు తెరిచింది. హౌజ్ లో కంటెస్టెంట్లతో చప్పట్లు కొట్టించుకోవడమే కాకుండా.. ప్రేక్షకులతో కూడా వావ్ అనిపించుంది.

బిగ్ బాస్ అడిగిన మీదట హౌజ్ లో కంటెస్టెంట్లపై తన అభిప్రాయాల్ని కుండబద్దలుకొట్టినట్టు చెప్పేసింది దివి. ఒక్కొక్కరిలో ఉన్న బలాలు-బలహీనతలు అన్నీ ఓపెన్ గా విడమర్చి చెప్పేసింది. అఖిల్ ఓవరాక్షన్ తగ్గించుకోవాలని, నోయల్ పక్కా ప్లాన్ తో వచ్చాడని, కల్యాణి ఏడుపు తగ్గించుకోవాలని, గంగవ్వ అతిగా రియాక్ట్ అవ్వకూడదంటూ ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసింది. దీంతో అందరూ ఆమెను మెచ్చుకున్నారు.

ఇక టాస్క్ ల విషయానికొస్తే.. టమాట రసం పిండే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అది పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయినా.. హౌజ్ లో వ్యక్తులు ఒకర్నొకరు అర్థం చేసుకోవడానికి బాగా పనికొచ్చింది. ఇక ఎలిమేషన్ రౌండ్ కు కీలకమైన కట్టప్ప ఎపిసోడ్ కు సంబంధించి గురువారం ఎపిసోడ్ లో చిన్న కదలికి వచ్చింది.

కట్టప్ప ఎవరై ఉంటారో కనుక్కోమని.. అరియానా-సొహైల్ కు బిగ్ బాస్ సెపరేట్ గా చెప్పడం.. నిజంగానే బిగ్ బాస్ చెప్పాడా అని మిగతా సభ్యులు అనుమానించడం.. ఎవరో ఎందుకు నేనే కట్టప్ప అంటూ నోయల్ తనకుతానే ఒప్పేసుకోవడం లాంటివి ఉన్నాయి. అయితే ఇవన్నీ కొన్ని మాత్రమే గురువారం ఉన్నాయి. ఈరోజు ఆ కీలకమైన ఘట్టం కొనసాగబోతోంది.

Bigg Boss Telugu 4లో తొలి ఎలిమేషన్ రౌండ్ కు అంతా సన్నద్ధమైంది. ఆల్రెడీ దీనికి ఏడుగురు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఎపిసోడ్ తో ఈ ఎలిమేషన్ రౌండ్ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక నాగార్జున రాకతో హౌజ్ నుంచి ఎవరు ముందుగా బయటకు వెళ్లిపోతారనేది తేలిపోతుంది. అది ఈ వీకెండే జరుగుతుందా లేక మరో వారం పోస్ట్ పోన్ అవుతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటికి గంగవ్వ లీడ్ లో ఉంది.

Related Stories