మోనాల్ గుడ్డు లొల్లి

Monal Gajjar

Bigg Boss Telugu 4 – Episode 6
బిగ్ బాస్ హౌజ్ లో మొదటి విడత ఎలిమేషన్ కు కీలకంగా మారిన కట్టప్ప ఎపిసోడ్ పై శుక్రవారం కూడా క్లారిటీ రాలేదు. దీంతో పాటు నిన్నటి ఎపిసోడ్ లో హైలెట్స్ విషయానికొస్తే.. మోనాల్ గుడ్డు లొల్లి, కల్యాణి అలక జనాల్ని కూసింత ఎట్రాక్ట్ చేశాయి.

మోనాల్ గజ్జర్ గుడ్లు తినదట. అదే విషయాన్ని చెబుతూ.. ఎక్కడపడితే అక్కడ పడేయొద్దని హౌజ్ మేట్స్ కు ఆర్డర్ వేసింది. అయితే దీనిపై రాజశేఖర్ మాస్టర్ అసహనం వ్యక్తంచేశాడు. వంట చేసిన తర్వాత క్లీన్ చేస్తారని, కుకింగ్ చేస్తూ క్లీన్ గా ఉండడం కష్టమని  వాదనకు దిగాడు. నిజానికి ఇక్కడ మోనాల్-రాజశేఖర్ మధ్య బిగ్ ఫైట్ ఆశించారు ప్రేక్షకులు. ఎందుకంటే హౌజ్ లోకి వచ్చినప్పట్నుంచి వీళ్లిద్దరూ కాస్త ఎడమొహం-పెడమొహంగానే ఉంటున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు. మోనాల్ మెతక వైఖరి కారణంగా గొడవ మిస్సయింది.

మరోవైపు 4 రోజుల నుంచి హౌజ్ లో వంట చేస్తున్న కరాటే కల్యాణి, ఈసారి మాత్రం మొండికేసింది. తను ఈరోజు భోజనం చేయనని, వంట చేయనని ఆవిడ బుంగమూతి పెట్టింది. అయితే దీన్ని లాస్య, మోనాల్ మరోలా అర్థం చేసుకున్నారు. కల్యాణిపై అక్కసు పెంచుకున్నారు. దీంతో పాటు లగ్జరీ టాస్క్ లో భాగంగా టమాటా రసం పిండే కార్యక్రమం ఉన్నంతలో ఆకట్టుకుంది.

ఇక కీలకమైన కట్టప్ప విషయానికొస్తే.. గత సీజన్ టైపులోనే కట్టప్పగా ఎవర్ని అనుమానిస్తున్నారో వాళ్ల ముఖాలపై స్టాంప్ గుద్దాలని బిగ్ బాస్ ఆదేశించాడు. గత సీజన్ లో ఇలాంటి టాస్క్ వచ్చినప్పుడు పునర్నవి, రాహుల్ లాంటివాళ్లు తమ ముఖాలపై తామే స్టాంపులు వేసుకున్నారు. ఈసారి అలాంటివి లేకుండా ఉండడం కోసం ఎవరి ముఖాలపై వాళ్లు స్టాంపులు వేసుకోకూడదని రూల్ కూడా పెట్టాడు బిగ్ బాస్. ఈ క్రమంలో రాజశేఖర్ మాస్టర్ ముఖంపై 3 స్టాంపులు పడ్డంతో ఆయన కాస్త అసౌకర్యానికి గురయ్యాడు.

అయితే కట్టప్ప ఎవరనేది బిగ్ బాస్ ఈసారి కూడా చెప్పలేదు. ఈ వీకెండ్ నాగార్జున చేతిలో ప్రధాన అస్త్రం ఇదే కాబోతోంది.

Related Stories