కట్టప్పపై క్లారిటీ ఇచ్చిన నాగ్

Nagarjuna - Bigg Boss Telugu 4

Bigg Boss Telugu 4 – Episode 7
బిగ్ బాస్ సీజన్-4 ఫస్ట్ వీకెండ్ లో నాగార్జున అదరగొట్టాడు. కంటెస్టెంట్లను ఒక్కొక్కర్ని పరిచయం చేసి హౌజ్ లోకి పంపించిన తర్వాత.. తొలిసారి మళ్లీ బిగ్ బాస్ వేదికపై వచ్చిన నాగ్.. తన మార్క్ చమక్కులతో పాటు హౌజ్ లోని సభ్యుల బలాలు-బలహీనతల్ని స్టయిల్ గా చెప్పి ఎట్రాక్ట్ చేశారు. అలా ఈ వారమంతా పడుతూలేస్తూ సాగిన బిగ్ బాస్ సీజన్-4 నాగ్ రాకతో కాస్త ఊపందుకుంది. క్యూరియాసిటీ పెంచింది.

Bigg Boss Telugu 4 – Episode 7 హైలెట్స్ విషయానికొస్తే కంటెస్టెంట్ల మధ్య నాగ్ పెట్టిన చిన్న చిన్న సరదా గేమ్స్ తో పాటు కట్టప్ప ఎపిసోడ్ పై క్లారిటీ వచ్చేసింది. దీంతో పాటు ఎలిమినేషన్ రౌండ్ పై కూడా ఓ స్పష్టత వచ్చింది. కొన్ని రోజులుగా ఊరిస్తున్న కట్టప్ప ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా చూద్దాం

హౌజ్ లో కట్టప్ప ఉన్నాడంటూ బిగ్ బాస్ కొన్ని రోజులుగా ఊదరగొట్టాడు. ఎవరు కట్టప్ప అనే అంశంపై చీటీలు రాయించి డబ్బాలో వేయించాడు. ఆ తర్వాత ముఖాలపై స్టాంపులు కూడా కొట్టించాడు. ఇంత చేసిన తర్వాత నాగ్ సీన్ లోకి ఎంటరై.. అసలు హౌజ్ లో కట్టప్ప ఎవ్వరూ లేరని తేల్చిచెప్పేశాడు. అంతేకాదు.. హౌజ్ లో ఫస్ట్ కెప్టెన్ గా లాస్యను నియమించాడు. అలా కట్టప్ప ఎపిసోడ్ ఓ కొలిక్కి వచ్చింది.

ఇక కీలకమైన ఎలిమినేషన్ రౌండ్ విషయానికొద్దాం. ఫస్ట్ ఎలిమినేషన్ రౌండ్ లో భాగంగా ఏడుగురు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వీళ్ల నుంచి ముందుగా అభిజిత్ సేవ్ అయ్యాడు. ఆ తర్వాత జోర్దార్ సుజాత, గంగవ్వ కూడా సేవ్ అయినట్టు నాగార్జున ప్రకటించాడు. ఇక మిగిలిన నలుగుర్లో ఎవరు హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోతారనే విషయాన్ని ఆదివారం ప్రకటించబోతున్నాడు నాగ్. 

Related Stories