రేటింగ్లో మళ్ళీ మెరిసిన బిగ్ బాస్

Nagarjuna - Bigg Boss Telugu 4

బిగ్ బాస్ సీజన్-4 కుదురుకుంది. మొదటి రెండు వారాలు.. వీకెండ్ మినహా, వీక్ డేస్ లో వీక్ గా ఉన్న ఈ రియాలిటీ షో.. ఇప్పుడు ఆదివారం, సోమవారం అనే తేడా లేకుండా అన్ని రోజుల్లో నిలకడగా రేటింగ్స్ సాధిస్తోంది. ఈ వారం (సెప్టెంబర్ 19-25) వచ్చిన రేటింగ్స్ ఈ విషయాన్ని మరోసారి స్పష్టంచేశాయి.

ఎప్పట్లానే నాగార్జున రాకతో ఆదివారం ఎపిసోడ్ అదిరిపోయింది. ఏకంగా 13.6 (అర్బన్) టీఆర్పీ సాధించింది. శనివారం కూడా ఈ షో కు 9,64 టీఆర్పీ వచ్చింది. ఈ సంగతి పక్కనపెడితే.. సోమవారం నుంచి శుక్రవారం వరకు టెలికాస్ట్ అయ్యే బిగ్ బాస్ కార్యక్రమాలు కూడా ఊపందుకోవడం విశేషం.

ఉదాహరణకు 21వ తేదీ సోమవారం ప్రసారమైన బిగ్ బాస్ ఎపిసోడ్ నే తీసుకుంటే.. దానికి ఏకంగా 8.5 (అర్బన్) టీఆర్పీ వచ్చింది. మంగళవారం, బుధవారం, శుక్రవారం ఎపిసోడ్లు కూడా మెరుగైన రేటింగ్స్ సాధించాయి. అంటే దీనర్థం బిగ్ బాస్ కంటెస్టెంట్లకు తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారన్నమాట.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. ఓవైపు ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటికీ.. బిగ్ బాస్ కు రేటింగ్ తగ్గకపోవడం. ఐపీఎల్ ప్రారంభానికి ముందు చాలామంది, చాలా అనుమానాలు వ్యక్తంచేశారు. కానీ ఐపీఎల్ మేనియాతో సంబంధం లేకుండా బిగ్ బాస్ సీజన్-4 దూసుకుపోతోంది.

తాజా టీఆర్పీల ట్రెండ్ గమనిస్తే.. వచ్చే వారం నుంచి బిగ్ బాస్ సీజన్-4కు మరింత టీఆర్పీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే హౌజ్ లో వేడి పెరిగింది. దానికి తగ్గట్టే షో చూసే ప్రేక్షకుల సంఖ్య కూడా పెరుగుతోంది.

Related Stories