అదరగొట్టిన బిగ్ బాస్.. రెకార్డ్ రేటింగ్స్

Nagarjuna - Bigg Boss Telugu 4

అంతా ఊహించిందే జరిగింది. బిగ్ బాస్ కార్యక్రమం మరోసారి మెరిసింది. సీజన్-4లో కూడా తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఈ వారం (సెప్టెంబర్ 5-11) రేటింగ్స్ లో బిగ్ బాస్ దుమ్ముదులిపాడు. సెప్టెంబర్ 6న ప్రసారమైన ప్రారంభ ఎపిసోడ్ కు ఏకంగా 18.46 (అర్బన్) టీఆర్పీ వచ్చింది.

సీజన్ 4 కోసం నాగార్జున వేసిన వేషాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. 3 గెటప్స్ లో నాగ్ పై చేసిన ప్రోమోలు బ్రహ్మాండంగా క్లిక్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ముసలి గెటప్ లో నాగ్ మెరిశాడు. గోపీ.. అంటూ చెప్పే డైలాగ్ అయితే వైరల్ అయింది. దీనికితోడు కంటెస్టెంట్ల ఎవరై ఉంటారనే సస్పెన్స్ బిగ్ బాస్ కు పెద్ద మైలేజీగా నిలిచింది.

ఈసారి సీజన్-4లో హౌజ్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరనే క్యూరియాసిటీ జనాల్లో బాగా ఉంది. ఆ ఉత్సుకత రేటింగ్ రూపంలో కనిపించింది. అయితే జనాల క్యూరియాసిటీని అలానే కొనసాగించలేకపోయింది బిగ్ బాస్. ఆ మరుసటి రోజు సోమవారం, అంటే సెప్టెంబర్ 7 నుంచి ప్రసారమైన ఎపిసోడ్స్ కు అనూహ్యంగా రేటింగ్ తగ్గిపోయింది.

హౌజ్ లో ఇప్పుడిప్పుడే ప్రేమకథలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ సెట్ అయింది. సో..వచ్చే వారం నుంచి బిగ్ బాస్ రేటింగ్స్ మరింత పెరుగుతాయని స్టార్ మా ఛానెల్ అంచనా వేస్తోంది.

Related Stories