- Advertisement -

‘బిగ్ బాస్ తెలుగు 4’ గత కొన్ని వారాలుగా సాదాసీదా రేటింగ్స్ తో నడుస్తోంది. మొదట్లో ఉన్న ఊపు పోయింది అన్న కామెంట్ వినిపించింది. ఐతే, విచిత్రంగా ఇప్పుడు మళ్ళీ రేటింగ్ పరంగా టాప్ లోకి వచ్చింది. సాధారణంగా సండే, సాటర్ డే ఎక్కువ రేటింగ్ వస్తుంది. మిగతా రోజుల్లో చాలా తక్కువ ఉంటుంది.
కానీ పోయిన వారం (14th Nov – 20th Nov) బిగ్ బాస్ తెలుగు 4 వీక్ డేస్ ల్లో కూడా అదరగొట్టింది. శుక్రవారం, గురువారం కూడా 9, 10 రేటింగ్లు పండింది. ఆదివారం – 11.88, శనివారం – 9.53 ఉంటే గురువారం కూడా 9.42 రావడం విశేషం.
ఈ సీజన్ డిసెంబర్ 20న ముగుస్తుంది. ప్రస్తుతం మోనాల్, అభిజీత్, అరియనా, సోహైల్ మంచి వోటింగ్స్ పొందుతున్నారు.ఈ షో సక్సెస్ కావడంతో “జబర్దస్త్” పడుకొంది. మరి 4, 5 రేటింగ్ లతో సర్దుకొంది.