
మామిళ్ల శైలజా ప్రియ.. ఇలా చెబితే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ అంటే చాలామంది గుర్తుపడతారు. ‘మిర్చి’ లాంటి ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. దీనికి కారణం ఆమె సీజన్-5లో భాగంగా బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెడతారనే గాసిప్స్ వినిపించడమే.
ప్రియకు మంచి ఫాలోయింగ్ ఉంది. అటు బుల్లితెర, ఇటు వెండితెరపై ఆమెకు అభిమానులున్నారు. ఇలాంటి ఆర్టిస్టు హౌజ్ లో అడుగుపెడితే కచ్చితంగా హౌజ్ కు ఓ కళ వస్తుంది. షో కు క్రేజ్ వస్తుంది. అయితే ఆమె హౌజ్ లో అడుగు పెడుతుందా, పెట్టదా అనేది ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారింది.
బిగ్ బాస్ కొత్త సీజన్ ఎప్పుడు మొదలైనా.. రకరకాల పేర్లు చక్కర్లు కొట్టడం కామన్. గతంలో చాలామంది ప్రముఖుల పేర్లు తెరపైకొచ్చాయి. కానీ అందులో కొన్నే కార్యరూపం దాల్చాయి. మరి ప్రియ పేరు కల్పితమా లేక కచ్చితమా అనేది త్వరలోనే తేలిపోతుంది.
బిగ్ బాస్ కొత్త సీజన్ ఎప్పుడు మొదలైనా ఇండస్ట్రీ నుంచి ఎవరు హౌజ్ లో అడుగుపెడతారనే చర్చ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం స్టార్ మా యాజమాన్యం రూటు మార్చింది. సిల్వర్ స్క్రీన్ క్రేజ్ కంటే సోషల్ మీడియా పాపులారిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. సోషల్ మీడియా ప్రముఖులతో పాటు ఎప్పట్లానే యాంకర్లు కూడా కనిపించబోతున్నారు.