బిగ్ బాస్ vs జబర్దస్త్

బిగ్ బాస్ రాకతో ఛానెళ్ల టీఆర్పీలన్నీ మారిపోతాయని అంతా ముందే ఊహించారు. అనుకున్నట్టుగానే బిగ్ బాస్ సీజన్-4 రేటింగ్ వచ్చింది. చాలా కార్యక్రమాలు వెనక్కి వెళ్లిపోయాయి. వీటిలో ముఖ్యమైంది ఈటీవీలో సూపర్ హిట్టయిన జబర్దస్త్. ఈవారం రేటింగ్స్ లో ఇటు బిగ్ బాస్ కు, అటు జబర్దస్త్ కు దాదాపు సమానంగా రేటింగ్ వచ్చినట్టు కనిపించినప్పటికీ.. ఓవరాల్ గా ఇంప్రెషన్స్ పరంగా చూసుకుంటే జబర్దస్త్ కు వీక్షణల సంఖ్య (ఇంప్రెషన్స్) తగ్గిపోయింది.

తెలుగులో సూపర్ హిట్ కార్యక్రమాల్లో ఒకటి జబర్దస్త్. గురువారం, శుక్రవారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలకు హయ్యస్ట్ రేటింగ్స్ వస్తుంటాయి. ఈ టైమ్ లో మిగతా ఛానెళ్లలో వచ్చే ప్రొగ్రామ్స్ అన్నీ బొటాబొటి టీఆర్పీలతో సర్దుకోవాల్సిందే. కానీ బిగ్ బాస్ మాత్రం ఈ కామెడీ ప్రొగ్రామ్స్ కు గట్టి పోటీగా నిలిచింది. గురు-శుక్రవారాల్లో (సెప్టెంబర్ 10-11 తేదీలు) జబర్దస్త్ కు పోటీగా నిలిచింది బిగ్ బాస్.

సీజన్-3 టైమ్ లో కూడా బిగ్ బాస్-జబర్దస్త్ మధ్య గట్టి పోటీ నడిచింది. కొన్ని వారాలు బిగ్ బాస్ ది పైచేయిగా నిలిస్తే, మరికొన్ని వారాలు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలు లీడ్ లోకి వచ్చాయి. దాదాపు అదే పరిస్థితి ఈ సీజన్ కు కూడా కొనసాగేలా ఉంది. అయితే జబర్దస్త్ ఫార్మాట్ మారదు. ప్రతి వారం వాళ్లే కనిపిస్తారు, జోకులు మారుతుంటాయి. బిగ్ బాస్ కు ఆ బాధ లేదు. మంచి వైల్డ్ కార్డుల్ని రంగంలోకి దింపి.. గురు-శుక్రవారాల గేమ్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెడితే.. జబర్దస్త్ ను కొట్టడం బిగ్ బాస్ కు పెద్ద పనికాదు.

రాబోయే రోజుల్లో గురు-శుక్రవారాల్లో జబర్దస్త్ ది పైచేయిగా నిలుస్తుందా లేక బిగ్ బాస్ తన సత్తా చూపిస్తాడా అనేది చూడాలి.

Advertisement
 

More

Related Stories