
‘బిగ్ బాస్ తెలుగు 4’లో విన్నర్ గా అభిజీత్ నిలుస్తాడని మొదటి మూడు వారాలు ముగిసిన వెంటనే అందరూ బెట్ కట్టడం మొదలుపెట్టారు. దానికి తగ్గట్లే అతను విన్నర్ అయ్యాడు. మొదటినుంచి అభిజీత్ గేమ్ పక్కాగా ఆడాడు. ఈ సీజన్ లో రెండు రొమాంటిక్ ట్రాక్ లు నడిపినట్లు ఒక ఇంప్రెషన్ కల్పించాడు. మొదట మోనాల్ గజ్జర్ తో, ఆ తర్వాత దేతడి హారికతో మంచి కెమిస్ట్రీ ప్రదర్శించాడు.
అటు యూత్, ఇటు మాస్ ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు.
రన్నరప్ గా నిలిచిన అఖిల్ ఫైనల్ దాకా రావడమే గ్రేట్. ఐతే, అతనికి చివరి వారాల్లో ఓట్లు బాగా పడ్డాయి.
మొదటి సీజన్
విన్నర్ – నటుడు శివ బాలాజీ
రన్నరప్ – ఆదర్శ్ బాలకృష్ణ
రెండో సీజన్
విజేత – నటుడు కౌశల్
రన్నరప్ – గీతా మాధురి
సెలబ్రిటీ గెస్ట్: వెంకటేష్
మూడో సీజన్
విన్నర్ – సింగర్ రాహుల్ సిప్లిగంజ్
రన్నరప్ – శ్రీముఖి
సెలబ్రిటీ గెస్ట్: చిరంజీవి
మొదటి సీజన్ కి హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరించారు. రెండో సీజన్ కి నాని . మూడు, నాలుగు సీజన్లకు నాగార్జున హోస్ట్ గా అదరగొట్టారు. ఐదో సీజన్ 2021 జులైలో మొదలవుతుంది.