దూసుకుకెళ్తోన్న తెలుగు బ్యూటీ

బిందు మాధవి అంటే తమిళ హీరోయిన్ అని అనుకుంటారు చాలామంది. ఆమె తమిళంలో ఎక్కువ సినిమాలు చేసిన మాట వాస్తవం. అక్కడే ఎక్కువ గుర్తింపు తెచుకున్నదీ నిజం. కానీ ఆమె అచ్చ తెలుగు అమ్మాయి. తెలుగులోనే మొదట కెరీర్ మొదలుపెట్టింది. ఇక్కడ కన్నా అక్కడ ఎక్కువ గుర్తింపు రావడంతో రచ్చ గెలిచింది.

ఇప్పుడు ఇంట గెలుస్తోంది. ఇటీవల ఆమె నటించిన ఒక వెబ్ సిరీస్ పాపులర్ అయిందట. దాంతో ఏకంగా కొత్తగా నాలుగు వెబ్ సిరీస్ లు ఒప్పుకొంది. అలాగే ఒక సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా బిజీగా మారింది.

అంతేకాదు, ఇప్పుడు హైదరాబాద్ బేస్ గా వర్క్ చేస్తోంది.

వరుసగా వస్తోన్న అవకాశాలను మరింత అందిపుచ్చుకునేందుకు లేటెస్ట్ గా తను ఓ ఫోటో షూట్ కూడా చేసింది. ఈ ఫోటో షూట్ లో తన స్టైలిష్ లుక్స్ తో ఆల్ట్రా మోడ్రన్ గా కనిపిస్తోంది. మరింత దూకుడుగా అన్ని ఆఫర్స్ ను లాగే ప్రయత్నాల్లో ఉంది బిందు మాధవి.

 

More

Related Stories