రానాకి బయో బబుల్ ఎందుకు?

Rana Daggubati

రానా దగ్గుబాటి అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. అసలు తను ఎందుకు అనారోగ్యానికి గురి అవ్వాల్సిందో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. “చిన్నప్పటి నుంచి హై బీపీ వుంది. అది పెద్ద పెరిగాక మరింతగా పెరిగింది. వయసుతో పాటు రక్తపోటు అధికం కావడంతో ఒక రోజు ఉన్నట్టుండి పడిపోయాను. డాక్టర్ చెకప్ కి వెళ్తే… అది హార్ట్ అటాక్ గా మారొచ్చు, కిడ్నీలపై ప్రభావం చూపొచ్చు అన్నారు. దాంతో ట్రీట్మెంట్ తీసుకున్నా,” అని వివరించాడు.

అతని హెల్త్ కండిషన్ ఇప్పుడు బాగానే ఉంది. ఐతే, “విరాట పర్వం” మేకర్స్ మాత్రం రిస్క్ తీసుకోదల్చుకోలేదు. రానాకి మరింత కంఫర్ట్ కలిగేలా సెట్ లోనే బయో బబుల్ క్రేయేట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరగనుంది. రానా రోజు హైదరాబాద్ కి వచ్చి పోవడం కన్నా… వికారాబాద్ అడవుల్లోనే… షూటింగ్ లొకేషన్ లోనే రానాకి వసతి కల్పించడం, మొత్తం టీం అంతా షూటింగ్ పూర్తి అయ్యేంతవరకు అక్కడే ఉండేలా ఏర్పాట్లు చెయ్యడం వంటి వాటిపై దృష్టి పెట్టారు.

బయో బబుల్ అంటే “ఒక ప్లేస్ లోకి ఒకసారి కొందరు అడుగుపెట్టాక, మరెవ్వరూ అడుగుపెట్టారు. బయటికి ఎవర్ని వెళ్లనివ్వరు. అంటే పూర్తిగా సురక్షితంగా ఉంటుంది ఆ ప్లేస్.” కోవిడ్ 19 నేపథ్యంలో షూటింగ్ ప్లేస్ వద్ద రిస్క్ తీసుకోవద్దనుకుంటున్నారు మేకర్స్. ఆలా రానాకీ కంఫర్ట్ కలిగేలా ప్లాన్ చేస్తున్నారట.

More

Related Stories