సాక్షిలో సత్తి మార్క్!

Bithiri Sathi

టీవీ9 యాజమాన్యం చేసిన పిచ్చి పనులతో విసుగెత్తి బయటకొచ్చిన బిత్తిరి సత్తి, నేరుగా వెళ్లి సాక్షి ఛానెల్లో చేరిన సంగతి తెలిసిందే. షార్ట్ గ్యాప్ తీసుకొని “గరంగరం వార్తలు” అంటూ సాక్షిలో ప్రత్యక్షమైన సత్తికి ఛానెల్ లో ఎలాగైతే సాదర స్వాగతం దక్కిందో, ప్రేక్షకుల్లో కూడా అలాంటి మంచి స్వాగతమే లభించింది.

తాజాగా వచ్చిన రేటింగ్స్ చూస్తే సాక్షిలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది గరంగరం వార్తలు కార్యక్రమం. రేటింగ్స్ లో మొదటి 4 స్థానాలు దీనివే. అయితే టీవీ9లో సత్తి స్టార్ట్ చేసిన “ఇస్మార్ట్ న్యూస్”తో పోల్చుకుంటే “గరంగరం” రేటింగ్ తక్కువే అని చెప్పాలి. అయితే తప్పు ఆ కార్యక్రమంలో లేదు. సాక్షితో పోలిస్తే టీవీ9 రీచ్ చాలా ఎక్కువ (దాదాపు రెట్టింపు). అందుకే ఈ రేటింగ్ లో వ్యత్యాసం. అంతేతప్ప, అది సత్తి తప్పు కాదు.

అయితే సత్తి రాకతో సాక్షి ఛానెల్ రీచ్, రేటింగ్ రెండూ పెరిగాయనేది మాత్రం వాస్తవం. ఇన్నాళ్లూ సాక్షికి ఫ్లాగ్ షిప్ ప్రొగ్రామ్ అంటూ ఏదీ లేదు. రకరకాల పేర్లు పెట్టి ఎప్పుడూ వార్తలే ఇస్తున్నారు. ఇప్పుడు గరంగరం వార్తలు కార్యక్రమంతో ఆ ఛానెల్ కు చెప్పుకోడానికి ఓ ప్రొగ్రామ్ దొరికింది.

మరో వైపు, బిత్తిరి సత్తి కూడా కరోనా బారిన పడ్డారట. ప్రస్తుతం హోమ్ క్వరెంటైన్ లో ఉన్నాడట.

Related Stories