కారెక్కిన బిత్తిరి సత్తి

Bitthiri Satti

టీవీ యాంకర్ గా, జర్నలిస్ట్ గా చాలా పాపులర్ బిత్తిరి సత్తి. చాలా ఏళ్ళు “తీన్ మార్” ప్రోగ్రాంలో మెరిశారు. ఆ తరువాత టీవి9లో, సాక్షి టీవీలో పని చేశారు. ఇప్పుడు ప్రతి సినిమా ప్రొమోషన్ కి వీడియో ఇంటర్వ్యూలు చేస్తూ బాగా సంపాదిస్తున్నారు. జనంలో మంచి పాపులారిటీ ఉన్న బిత్తిరి సత్తి ఇప్పుడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

తాజాగా బీఆర్ఎస్ పార్టీ కండువా క‌ప్పుకొన్నారు బిత్తిరి సత్తి. మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

బిత్తిరి స‌త్తి అసలు పేరు చేవెళ్ల ర‌వికుమార్‌. ముదిరాజ్ సామాజిక‌వ‌ర్గానికే చెందిన బిత్తిరి సత్తి చేరిక వల్ల తెలంగాణ అధికార పార్టీకి ఆ సామజిక వర్గంలో కొంత హెల్ప్ అవుతుంది.

ఇక నవంబర్ 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిత్తిరి సత్తి పాల్గొంటారు.

Advertisement
 

More

Related Stories