పవన్ ‘అధిపతి’ అవుతాడు: బీజేపీ

Pawan Kalyan


పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా ఈ రాష్ట్రానికి అధిపతి అవుతాడు అని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు అంటున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా పవన్ కళ్యాణ్ ని ఎంతో గౌరవిస్తారని, పార్టీ నాయకులు అందరూ అదే గౌరవాన్ని చూపాలంటూ వీర్రాజు తాజాగా తమ పార్టీ వారికి సూచించారు.

బీజేపీకి జనసేన దూరం జరగాలని అనుకుంటున్నట్లు జోరుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వీర్రాజు టోన్ మారింది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని అదేపనిగా పొగిడేస్తోంది. ఏకంగా ఆయనని సీఎం చెయ్యాలని మోదీ అనుకుంటున్నట్లు మాట్లాడుతోంది బీజేపీ.

ఇలా ఒక్కసారిగా బీజేపీ ట్యూన్ మార్చడానికి రీజన్ ఉంది.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సడెన్ గా తన నిర్ణయం మార్చుకోవడంతో బీజేపీకి మైండ్ బ్లాంక్ అయింది. సురభి వాణీదేవికి తమ పార్టీ సపోర్ట్ ఇస్తుందని పవన్ కళ్యాణ్ ఎన్నికల రోజు ప్రకంటించారు. పవన్ కళ్యాణ్ వల్లే ఆమె గెలవలేదు కానీ పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయనకి ఉపయోగపడింది. సురభి వాణీదేవి గెలవడం, బీజేపీ సిట్టింగ్ సీట్ ని కోల్పోవడంతో ఒక్కసారిగా ఈక్వేషన్లు మారిపోయాయి. పవన్ కళ్యాణ్ ని మచ్చిక చేసుకోవడం తప్పట్లేదు బీజేపీకి.

తిరుపతిలో జనసేన మద్దతు లేకపోతే, బీజేపీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అందుకే ఇపుడు పవన్ కళ్యాణ్ ని హీరోని చేస్తోంది బీజేపీ.

More

Related Stories