త్రివిక్రమ్ కి కూడా నో ‘ఫిలిం’

- Advertisement -
Trivikram


హైదరాబాద్ పోలీసులు నిబంధనల ఉల్లంఘనపై గట్టి చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా కార్లకు ఉన్న బ్లాక్ ఫిలింలను తొలగిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలని అతిక్రమించి సెలెబ్రిటీలు, సామాన్యులు… ఇలా అందరూ తమ వాహనాలకు బ్లాక్ ఫిలిమ్స్ ని వేసుకుంటున్నారు. ఎండ నుంచి రక్షణ అనో, ప్రైవసీ అనో… నిబంధనలు ఎవరూ పాటించడం లేదు.

ఐతే, జూబ్లిహిల్స్‌ పరిధిలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ సెలెబ్రిటీల కార్లకున్న ఫిలింలను కూడా తొలగిస్తున్నారు పోలీసులు. తాజాగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కారుని ఆపి, ఆయన కారుకున్న బ్లాక్‌ ఫిలింను తొలగించారు. రూ. 700 జరిమానా విధించారు. ఆ టైంలో త్రివిక్రమ్ కూడా కారులోనే ఉన్నారు. ఆయన పోలీసులకు పూర్తిగా సహకరించి… ఫిలిం తొలగించేశారు.

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం వై కేటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇంకెవరు బ్లాక్ ఫిలిం వాడకూడదు.

ఇటీవల జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌ల కార్లకున్న ఫిలింని కూడా తొలగించారు ట్రాఫిక్ పోలీసులు.

 

More

Related Stories