అప్పుడు టాలీవుడ్, ఇప్పుడు బాలీవుడ్

Kangana

2017లో టాలీవుడ్ ని కుదిపేసిన డ్రగ్సు కేసు గుర్తుందా? పూరి జగన్నాధ్, ఛార్మి, రవితేజ, ముమైత్ ఖాన్, సుబ్బరాజ్, నవదీప్, తనీష్… ఇలా ఎందరో తారలు కమిషనర్ అకున్ సభర్వాల్ ముందుకు వెళ్లారు. గంటల తరబడి విచారణ జరిగింది. మీడియాలో ఎన్నెన్నో ఊహాగానాలు. ఛార్మి, పూరి వంటి వారి అరెస్ట్ తప్పదని కూడా ప్రచారం సాగింది. కానీ కొన్నాళ్ళకు ఆ కేసు మరుగున పడింది. డ్రగ్స్ సరఫరా చేసే ఏజెంట్లు, అమ్మే ముఠాలను మాత్రం చంచలగూడకి పంపించగలిగారు.

టాలీవుడ్ లో డ్రగ్స్ దందా తగ్గింది …కానీ స్టార్ల గురించి జరిగిన చర్చ, రచ్చ గాసిప్ కాలమ్ లకి పరిమితమైంది.

ఇప్పుడు సేమ్ సీన్. ఈ సారి… ప్లేస్ ముంబై. పరిశ్రమ.. బాలీవుడ్. సుశాంత్ సింగ్ రాజపుత్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఫైనల్ గా డ్రగ్సు ముఠాల వద్ద చక్కర్లు కొడుతోంది. రియా చక్రవర్తి… సుశాంత్ కి తెలీకుండా… అతనికి డ్రగ్స్ ఎక్కించేది అనేది ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ.

దీనికి తోడు.. రంగంలోకి కంగనా దిగింది. బాలీవుడ్ లో 99 శాతం మంది హీరోలు డ్రగ్స్ తీసుకుంటారని. అవి లేకుండా ఉండరని చెప్పింది. పనిలో పనిగా హృతిక్ రోషన్ పై పాత ఆరోపణలను మరోసారి గుప్పించింది. ఇప్పుడు… బాలీవుడ్ డ్రగ్స్ గురించి పెద్ద రచ్చ మొదలయింది.

సుశాంత్ మరణం కేసుని అడ్డం పెట్టుకొని… బాలీవుడ్ లో తనకి గిట్టని వారందరిని ఇరుకున పెట్టె పని పెట్టుకొంది కంగనా. తన జీవితంలో ఒక్కసారి కలవని ఒక హీరో గురించి కంగన చేస్తున్న గోల బుర్ర ఉన్నవాళ్ళకెవరైనా ఏవగింపు కలిగిస్తోంది. ఐతే… ఆమె బాలీవుడ్ లో డ్రగ్స్ దందా గురించి రచ్చ చెయ్యడంలో సక్సెస్ సాధించింది.

Related Stories