బాలీవుడ్ తో తెలుగు చిత్రాలకు చిక్కు

Rakshabandhan and Laal Singh


ఈ వీకెండ్ రెండు భారీ బాలీవుడ్ చిత్రాలు విడుదలయ్యాయి. అవే… అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’, అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన ‘రక్షాబంధన్’. కానీ, వాటికి సరైన ఓపెనింగ్స్ దక్కలేదు. ఈ రెండు సినిమాలతో మాత్రం మన తెలుగు చిత్రాలకు అమెరికాలో పెద్ద చిక్కే వచ్చింది.

‘లాల్ సింగ్ చద్దా’, ‘రక్షాబంధన్’ అమెరికాలో ప్రైమ్ థియేటర్లను పొందాయి. ఎక్కువ షోలు దక్కించుకున్నాయి. వాటికి తోడు, ఇతర భాషల చిత్రాలు, హాలీవుడ్ మూవీస్ తో థియేటర్లు ప్యాక్ అయి ఉన్నాయి. దాంతో, ఈ వీకెండ్ తెలుగు సినిమాలకు తక్కువ థియేటర్లు దక్కాయి. లేదా సుదూర ప్రాంతాల్లో ప్రదర్శించాల్సి వస్తోంది.

ఈ వెకెండ్ నితిన్ నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’, నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2’ విడుదల అవుతున్నాయి. ‘మాచర్ల నియోజకవర్గం’ ప్రీమియర్ షోలకు మంచి థియేటర్లు దక్కాయి. ఈ రెండు కొత్త సినిమాలతో పాటు ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న ‘సీతారామం’, ‘బింబిసార’ ఉన్నాయి. అన్నింటికి మంచి థియేటర్లు దక్కాలంటే కష్టమే. అందుకే, ఈ వారం పెద్ద చిక్కే వచ్చి పడింది.

‘సీతారామం’ సినిమా ఇప్పటికే వన్ మిలియన్ డాలర్ల వసూళ్లకు చేరువలో ఉంది. ‘బింబిసార’ అర మిలియన్ డాలర్ల వసూళ్లకు దగ్గర్లో ఉంది.

Advertisement
 

More

Related Stories