ప్రభాస్ మూవీ అంటే బాలీవుడ్ స్టార్స్!

Prabhas

ప్రభాస్ తో సినిమాలు తీస్తున్న నిర్మాతలు, దర్శకులు కాస్టింగ్ విషయంలో పోటీపడుతున్నారు. అటు నాగ్ అశ్విన్, అశ్విన్ దత్…. ఇటు ఓం రౌత్, టి సిరీస్ ప్రభాస్ తో తాము తీస్తున్న సినిమాలకు బాలీవుడ్ నటులను తీసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే… “సాహో” సినిమాతోనే ఈ ట్రెండ్ మొదలైంది. శ్రద్ధ కపూర్, నీల్ నితిన్ ముకేశ్, జాకీ ష్రాఫ్, ఛంకీ పాండే, మందిరా బేడీ, ఎవిలిన్ శర్మ… ఇలా ఆ సినిమా ఫ్రేమ్ నిండా బాలీవుడ్ తారలే. ప్రభాస్ కి నార్త్ ఇండియా మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది. “సాహో” తెలుగులో ఫ్లాప్ అయినా కూడా హిందీలో సూపర్ హిట్టయింది.

ప్రభాస్ వచ్చే ఏడాది మొదలుపెట్టే 21, 22 చిత్రాలు కూడా పాన్ ఇండియా ఆడియెన్స్ కోసమే. అందుకే దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా కీలక పాత్రలకు బాలీవుడ్ తారలను తీసుకుంటున్నాడు. హీరోయిన్ గా దీపికా పడుకునే, మరో కీలక పాత్రకి అమితాబ్ బచ్చన్ ని తీసుకొస్తున్నారు.

ఇక 22వ చిత్రంగా రూపొందే “ఆదిపురుష్”లో మెయిన్ విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కన్ఫర్మ్ అయ్యాడు. హీరోయిన్ కూడా బాలీవుడ్ భామే. మొత్తానికి… ప్రభాస్ మూవీ అంటే బాలీవుడ్ స్టార్స్ ఇతర పాత్రల్లో ఉండాలి అనేది ఫిక్స్ అయినట్లుంది.

Related Stories